benefits of fruits and vegetables in telugu

వాము తినడం వలన హాని కలుగుతుందా ?

వాము తినడం వలన హాని కలుగుతుందా ?

భారతదేశంలోని వంటశాలలో విరివిగా వినియోగించే ఆహారపదార్ధాలలో వాము ముందు వరుసలో ఉంటుంది. సుగంధిత పూల మొక్క జాతి అయిన అపియాసియాకి చెందిన ఈ వాములోని గుణాలు, ఆహార రంగంలోనే కాక ఆయుర్వేద రంగంలో కూడా లాభసాటిగా ఉంటాయి. భారత ప్రాచీన కాలం నుండి కూడా ఈ వామును జీర్ణ వ్యవస్థలోని లోపాలను సవరించాడనికి వినియోగించడం పరిపాటి. ఆహారానికి మంచి సువాసనను జతచేయడమే కాకుండా ఎన్నో ఆరోగ్య లక్షణాలు ఉన్న ఈ వామును మితిమీరి తింటే దుష్ప్రభావం కూడా తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో ఒకసారి చూద్దాం.

వాము వలన కలిగే నష్టాలు
 • వామును అధికంగా తినడం మూలంగా మలబద్దకం కలగవచ్చని ఆరోగ్య సంరక్షకుల భావన. దీనికి ఒంట్లో వేడిని పుట్టించే గుణం ఉంది కనుక పేగులలో పేరుకుపోయిన మలినాన్ని గట్టిపరుస్తుంది, తద్వారా వ్యర్ధాలను తొలగించడంలో శరీరానికి ఇబ్బంది కలుగుతుంది.
 • శరీరంలో వేడిని పెంచే గుణం కారణంగానే చాలా మంది వైద్యులు గర్భస్థ స్త్రీలను దీనికి దూరంగా ఉండమని సలహా ఇస్తుంటారు.
 • వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వాము అధికంగా తినడం వలన జీర్ణ వ్యవస్థకి ఇబ్బందిగా మారుతుందట. ఇది ముదిరితే కడుపులో అసిడిటీ కూడా కలగవచ్చు. అయితే ఈ పరిస్థితి కొంతకాలం వరకే ఉంటుంది కనుక దీని వలన ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు.
 • వామును అధికంగా తినడం వలన కాలేయం చెడిపోయే ప్రమాదం కూడా ఉందని కొంతమంది అనుభవజ్ఞులు అంటున్నారు. ముఖ్యంగా వివిధ కాలేయ సమస్యలతో బాధపడేవారు దీనికి దూరంగా ఉంటేనే మంచిదట.
 • బ్లాక్ హేంబనే, వాములో ఒక రకమైన దీనిని అధికంగా తీసుకుంటే రక్తపోటు పెరిగి హృద్రోగ సమస్యలు కూడా ఉత్పన్నమవొచ్చని అధ్యయనకారులు అంటున్నారు.
 • ఇక కడుపులో అల్సర్లు ఉన్నవారు వాముకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
వాముతో లాభాలు
 • జీర్ణ క్రియ సక్రమంగా ఉండేలా చేసేది గ్యాస్ట్రిక్ జ్యూస్ కాగా వాములో ఉండే ఎంజైములు అందుకు బాగా తోడ్పడుతాయి. అందుకనే కడుపు నొప్పికలిగినా, వాతం చేసినా వాము తింటే వెంటనే సమస్య పరిష్కారం అవుతుంది.
 • కొంతమంది ఆరోగ్య నిపుణుల ప్రకారం, వాము పొడిని శుభ్రమైన గుడ్డలో ఉంచి పీలిస్తే ఎంతో తీవ్రమైన తలనొప్పి అయినా మాయమవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 • ఇక జలుబుతో బాధపడేవారు గోరువెచ్చని నీటితో వామును తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
 • అంతేకాకుండా తీవ్రమైన చెవిపోటుకు కూడా వాము దివ్య ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. ఈ సమయంలో నొప్పి ఉన్న చెవిలో కేవలం రెండు చుక్కల వాము నూనెను వేస్తె సరిపోతుంది.
 • ఆయుర్వేదంలో అయితే దీని ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. బరువు తగ్గేందుకు వినియోగించే మందులతో పాటు గుండె మరియు మూత్రపిండాల సమస్యల పరిష్కారానికి వినియోగించే మందులలో కూడా వామును ఎక్కువగా వినియోగిస్తారు.
 • మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లను కరిగించడానికి, జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచడానికి వామును మించిన ఔషధం ఇంకొకటి లేదంటే అతిశయోక్తి లేదేమో.
 • ఆరోగ్య చిట్కాలు :

 • ఆస్తమా కొరకు : ఒక స్పూను వామును కొంచెం బెల్లం ముక్కతో కలిపి మిశ్రమంగా చేసుకుని రోజూ ఉదయాన్నే తింటే ఆస్తమా ప్రభావం నెమ్మదిగా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
 • పసిపిల్లలలో అజీర్తికి : కొంచెం మోతాదులో వామును నూరి, తల్లి పాలతో కలిపి పసిపిల్లలకు ఉగ్గు పట్టాలి. ఇలా చేస్తే వారి జీర్ణ క్రియ సాఫీగా సాగుతుంది. భారత సాంప్రదాయంలో ఈ విధంగా వామును పిల్లలకు పట్టడం అమృతంతో సమానమని భావిస్తుంటారు.
Continue Reading

శీతాకాలంలో సీతాఫలం చేసే మేలు ?

శీతాకాలంలో సీతాఫలం చేసే మేలు ?

ఎన్నో ఖనిజాలు, విటమిన్లు మరియు అనామ్లజనకాలతో పాటు అత్యధిక పీచు పదార్ధాలతో సమృద్ధిగా ఉండే సీతాఫలం మన ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తుంది. అంతేకాదు ఎన్నో సౌందర్య గుణాలు కలిగిన పండ్ల జాబితాలో ఈ సీతాఫలం ముందు వరుసలో ఉంటుంది. భారతదేశంలో విరివిగా లభించే ఈ పండు ఆబాలగోపాలానికి ఎంతో ఇస్టమైనది కాగా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ మొదలగు రాష్ట్రాలలో లభిస్తుంది. వెస్ట్ ఇండీస్ మొదలుకుని అమెరికాలోని ఉష్ణప్రాంతాలలో పుట్టి వ్యాపించిన ఈ పండులో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలతో పాటు కొన్ని హానికరమైన గుణాలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో ఒకసారి చూద్దాం.

సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు :
 • కణాల క్షీణతకు కారణమయ్యే ఫ్రీ రాడికల్సును విటమిన్ సి సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఈ గుణానికి కేంద్రంగా నిలిచే సీతాఫలంను శీతాకాలం ఆసాంతం తీసుకుంటే సంవత్సర కాలం ఎన్నో రోగాల నుండి విముక్తిని పొందవచ్చు.
 • అంతేకాదు ఈ విటమిన్ సి కంటి చూపుకు, జీర్ణ వ్యవస్థను క్రమబద్దీకరించడంలోనూ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అందుకే ఆరోగ్య నిపుణులు ఈ పండ్లను తప్పకుండా తీసుకోవాలని సూచిస్తుంటారు.
 • ఇక జుట్టు మరియు చర్మ సంరక్షణకు విటమిన్ ఏ పోషణలు కీలకం కాగా సీతాఫలంలో అధిక మోతాదులో ఇవి లభిస్తాయి. అందుకే ఈ పండును సిఫారసు చేయని సౌందర్య నిపుణుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.
 • పొటాషియం మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉన్న సీతాఫలం ఎన్నో గుండె జబ్బులను సమర్ధవంతంగా ఎదుర్కోగలదు.
 • ఇందులో ఉండే పొటాషియం కండరాలకు నూతనోత్తేజాన్ని కలిగించి ముభావం అనే భావనను దరిచేరనివ్వదు. ముఖ్యంగా భారతదేశంలో శీతాకాలంలో ఉండే బద్దకాన్ని పోగొట్టడానికి ఈ పండు ఎంతో దోహదపడుతుంది.
 • ఇందులో ఉండే కాపర్ గుణాలు మలబద్దకాన్ని తొలగించడమే కాకుండా అతిసారం వంటి రోగాలను కూడా దరిచేరకుండా చేస్తాయి.
 • ఇక బక్కపలచగా ఉండి లావు కావాలని ప్రయత్నించేవారు శీతాకాలం పొడుగునా రోజూ ఒక పండు తింటే మేలు చేకూరుతుంది.
 • ఇక ఈ పండులోని గింజలను పొడిగా చేసి మొక్కలకు పురుగుల మందుగానూ, జుట్టులో చుండ్రును పోగొట్టడానికి గానూ వినియోగిస్తుంటారు.
 • అంతేకాకుండా సీతాఫలం చెట్టు ఆకులను, బెరడును, గింజలను ఆయుర్వేద రంగం మరియు ఫార్మా రంగంలో విరివిగా వినియోగిస్తారు.
 • వీటి ఆకుల రసాన్ని శరీరంపై గాయాలను నయం చేయడానికి వినియోగిస్తారు. ఇదే ఆకులను నీటిలో వేడి చేసి, ఆ నీరు తాగితే మధుమేహ సమస్యతో పాటు వృద్ధాప్యం దరిచేరదు.
సీతాఫలం వలన కలిగే అనర్ధాలు
 • బక్కపలచని వాళ్ళు బరువు పెరగడంలో సీతాఫలం దోహదపడుతుంది కానీ కొంతమందిలో అధిక బరువును కూడా పెంచుతుంది. కనుకనే సదరు వ్యక్తులు వీటిని అధిక మోతాదులో తీసుకోకుండా తగిన మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
 • ఇక వీటి తీయదనం కారణంగా పళ్ళ ప్రియులు వీటిని ఎక్కువగా తీసుకుంటే అజీర్తితో పాటు అతిసారం వంటి రోగాల బారిన పడే అవకాశం ఉంది.
 • వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఈ గుణం మన శరీరంలో అధికంగా చేరినపుడు కంటి చూపు సమస్యలతో పాటు మానసిక స్థితిలో మార్పు మరియు నిర్జలీకరణ స్థితికి కారణం కావచ్చని కొంతమంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 • అంతేకాకుండా వీటిలో ఐరన్ కూడా ఎక్కువే, శరీరంలో ఇది ఎక్కువగా చేరితే కడుపునొప్పితో పాటు ఇతర పేగు సంబంధిత రోగాలకు దారితీయవచ్చు.
 • ఆరోగ్య చిట్కాలు : మధుమేహం మరియు తీవ్ర జ్వరానికి

 • సీతాఫలం రెండు మూడు ఆకులను నీళ్లలో వేడిచేసుకుని ప్రతి రోజూ ఉదయం గోరువెచ్చగా తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
 • సీతాఫలం వేరును పేస్టులా చేసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని నీటికి పావు స్పూను పేస్టు కలుపుకుని తాగితే ఎంతటి తీవ్ర జ్వరమైనా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Continue Reading

ఉసిరితో మన శరీరానికి నష్టం ఉందా ?

ఉసిరితో మన శరీరానికి నష్టం ఉందా ?

ఎన్నో అద్భుత ఔషధ గుణాలు కలిగిన ఉసిరికి భారతదేశ సంప్రదాయంలో పవిత్రమైన స్థానం ఉంది. చాలా మంది భారతీయులు ఉసిరి అమృతం నుండి ఉద్భవించిందనే పురాణ నమ్మకాన్ని వ్యక్తపరుస్తుంటారు. భారతదేశ ఉన్నత జాతి పండుకు చెందిన ఈ ఉసిరి, ఆకురాల్చే చెట్టు జాతి అయిన ఫిలంటేసియాకు చెందినది. దీనిని పచ్చిగానూ, పిండిగానూ లేక నూనెగానూ వాడటం సహజం. ఇక ఆయుర్వేద రంగంలో అయితే ఉసిరిని అమృతానికి ఏమీ తక్కువ కాదని భావిస్తుంటారు, అటువంటి ఘనకీర్తి ఈ ఉసిరిది. అయితే ఇదంతా నాణేనికి ఒక పక్క మాత్రమే, ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ ఉసిరిలో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయంటే నమ్మడం కష్టమే. మరి అవేమిటో ఒకసారి చూద్దాం.

నష్టాలు
 • ఉసిరిని మధుమేహ వ్యాధినిరోధనకారిగా వినియోగించినప్పటికీ ఎక్కువ మోతాదులో వినియోగిస్తే గ్లూకోస్ స్థాయిలో మార్పు వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
 • అంతేకాకుండా అధిక మోతాదులో దీనిని తీసుకుంటే కడుపులో తిమ్మిరి మరియు మలబద్దకం వంటి రోగాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు.
 • చెప్పిన మోతాదుకన్నా ఎక్కువ ఉసిరి రసాన్ని తీసుకుంటే అతిసారంతో పాటు కడుపునొప్పి కూడా వస్తుందని సమాచారం. అందుకే చాలా మంది వైద్యులు గర్భస్థ మహిళలను మరియు పసిపిల్లలను దీనికి దూరంగా ఉండమని చెబుతుంటారు.
 • ఇక ఆయుర్వేద రంగంలో అయితే సూచించిన మోతాదుకు సరిపడా నీరు కలపకపోతే నిర్జలీకరణతో పాటు చర్మం మొద్దుబారడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
 • విటమిన్ సి అధిక మోతాదులో ఉండడం వలన ఉసిరిని ఎక్కువగా తీసుకుంటే కడుపులో ఎసిడిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయి.
 • కొంతమందిలో ఉసిరి అలర్జీని కలిగించడమే కాకుండా వాంతులు ఇంకా వికారానికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
లాభాలు
 • విటమిన్ సి గుణాలు పుష్కలంగా ఉండే ఈ ఉసిరి వలన రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది.
 • ఉసిరి రసాన్ని రోజూ తీసుకోవడం మూలంగా కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడమే కాకుండా గుండె ఆరోగ్యవంతంగా ఉంటుంది.
 • ఉసిరిలో ఉండే అనామ్లజనకాలు కణతులను ఏర్పడకుండా చేసి క్యాన్సర్ వంటి రోగాలను దరిచేరకుండా చేస్తుంది.
 • ఊపిరితిత్తులలో ఉండే వేడిని తగ్గించి, అంటువ్యాధులు నిరోధించడమే కాకుండా శ్వాస క్రియను మెరుగు పరుస్తుంది.
 • దీనికి మధుమేహ వ్యాధిని అరికట్టే గుణం ఉంటుంది కనుకనే చాలా మంది వైద్యులు రోజూ తీసుకోమని రోగులకు సూచిస్తుంటారు.
 • అంతేకాకుండా రోజూ ఉసిరి రసం తీసుకుంటే కంటి మరియు చర్మ రోగాల ఊసే ఉండదని వైద్యుల సలహా.
 • ఇందులో ఉండే అనామ్లజనకాలు చర్మ సౌదర్యాన్ని పెంచి వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి.
 • అతి ప్రాచీన కాలం నుండి కూడా ఉసిరిని జుట్టు సంరక్షణకు విరివిగా వాడుతుంటారు. అందుకే చాలా సంస్థలు తమ ఉత్పత్తుల తయారీలో ఉసిరిని వినియోగించడం జరుగుతుంది.
 • ఇక మధ్యపానంతో బాగా చెడిపోయిన కాలేయం కూడా ఉసిరి వాడకంతో మంచి ఆరోగ్యవంతంగా తయారవుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
 • ఆరోగ్య చిట్కాల : రక్తహీనతకు మరియు కాలేయ సంరక్షణకు

 • రక్తహీనత తగ్గడానికి అరగ్లాసు ఉసిరి రసానికి, అరగ్లాసు చెరకు రసం కలిపి తాగితే సరిపోతుంది.
 • అదే విధంగా అరగ్లాసు ఉసిరి రసానికి మరొక అరగ్లాసు ద్రాక్ష రసం కలిపి తాగితే కాలేయ సంబంధిత రోగాల నుండి విముక్తి లభిస్తుంది.
Continue Reading

మెంతుల వలన కలిగే లాభనష్టాలు

మెంతుల వలన కలిగే లాభనష్టాలు

రోజువారీ వంటలలో రుచితో పాటు అలంకరణ ప్రాయంగా ఉపయోగించే ఆహార పదార్ధం మెంతులు. అంతేకాకుండా బహుళ ప్రయోజనకారిగా మూలికా వైద్యంలో వీటి ప్రాముఖ్యతకు సాటిలేదనే చెప్పాలి. ఎన్నో పోషక విలువలతో కూడిన మెంతులు ఆసియా దేశం నుండి వ్యాప్తి చెందినట్లు అధ్యయనకారులు వెల్లడిస్తున్నారు. ఇక దిగుబడి విషయానికి వస్తే, ప్రపంచ పట్టికలో భారతదేశం మెంతుల సాగులో ప్రథమ స్థానంలో ఉండగా అందుకు రాజస్థాన్ రాష్ట్రం అత్యధిక దిగుబడితో తోడ్పడుతోంది. చాలా రకాల మొక్కల తరహాలోనే మెంతుల మొక్కలు కూడా పూర్తిగా తినదగినవే. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపే కాగా వీటి వలన కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం.

నష్టాలు
 • మెంతులు కూడా వేరుశనగ జాతికి చెందినవే, వాటి తరహాలోనే కొంతమందికి అలర్జీని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 • ఇక ఆస్థమా మరియు థైరాయిడ్ గ్రంథిలతో పోరాడే వారు సాధ్యమైనంత వరకు మెంతులకు దూరంగా ఉండడమే మంచిదట, ఇందుకు కారణం వాటిలో ఈ రోగాలను మరింత జటిలం చేసే గుణం ఉండడమే.
 • మధుమేహం కోసం వాడే మందులపై మెంతుల ప్రభావం ఉంటుంది కనుక ఆ వ్యాధిగ్రస్తులు వీటిని మితంగా వినియోగించాలని కొంతమంది వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
 • ప్రసవించిన తల్లులలో పాల శాతం పెంచేందుకు మెంతులను వాడటం జరుగుతుంది, అయితే అమితంగా వీటిని తీసుకోవడం మూలంగా తల్లితో పాటు బిడ్డకు కూడా విరేచనాలు అయ్యే సూచనలు ఉన్నాయట. తద్వారా సమస్య మరింత జటిలంగా మారి అతిసారం కూడా కలుగవచ్చు.
 • ఇక చివరగా మెంతులను రోజూ తీసుకునేవారిలో చెమటతో పాటు మూత్రం కూడా ఇబ్బందికరమైన వాసనను కలిగిస్తుంది.
లాభాలు
 • మేథీ లేక మెంతులను ప్రాచీనకాలం నుండి మంచి మూలికగా వినియోగించడం పరిపాటి. వీటి ఆకులను కూడా వంటశాలలో వినియోగిస్తారు. గ్రీన్ టీ తరహాలోనే వీటి ఆకులతో చేసే టీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
 • వీటి ఆకులను క్రమంగా తీసుకుంటే హృద్రోగ సమస్యలు దరిచేరవు, చెడు కొలెస్ట్రాల్ ఊసుండదు, బరువు తగ్గుతుంది మరియు జీర్ణశక్తి పెరుగుతుంది.
 • ఇక దీనిలో ఉండే వృద్ధాప్య నిరోధక గుణాలు చర్మాన్ని సంరక్షిస్తాయి.
 • ఎక్కువ మంది మెంతులను జుట్టు సంరక్షణకు వినియోగించడం పరిపాటి, వీటి వలన చుండ్రు తగ్గి మెరవడమే కాకుండా తెల్లబడటం మాని రాలడం నిరోధించబడుతుంది.
 • వైద్యుల ప్రకారం మెంతులలో క్యాన్సరును ఎదుర్కొనే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని క్యాన్సర్ బాధితులు ఎక్కువగా తీసుకుంటుంటారు.
 • ప్రసవించిన స్త్రీలలో పాలను ఉత్పత్తి చేసుకోవడానికి మెంతులను వినియోగించడం అనేది పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం.
 • వీటిలో ఉండే అనామ్లజనక మరియు తాపజనక గుణాలు కీళ్లనొప్పులు నివారించడంలో లాభసాటిగా ఉంటాయి.
 • ఇక వెంటనే బరువు తగ్గాలని అనుకునే వారు రోజూ మెంతులను నేరుగా లేక పిండిగా తీసుకుంటే మేలు జరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
 • చివరగా చెప్పాలంటే మూత్రపిండాలు మరియు కాలేయ సంరక్షణలో మెంతులు చేసే మేలు అద్భుతంగా ఉంటాయి.
 • ఆరోగ్య చిట్కా : మధుమేహా నివారణకు మరియు బరువు తగ్గడానికి

 • అరగ్లాసు మజ్జిగకు రెండు చెంచాలు లేక పది గ్రాముల పచ్చి మెంతి పిండి కలుపుకుని తాగితే మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది.
 • ఇక బరువు తగ్గాలనుకునేవారు, రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా మెంతులను నానబెట్టాలి.
 • ఉదయమే పడిగడుపున ఆ నీటిని వడకట్టి తాగాలి. ఇలా నెలరోజుల పాటు చేయడం వలన బరువు తగ్గడంతో పాటు చాలా ఉపయోగాలు కలుగుతాయి.
Continue Reading

ఉల్లి

ఉల్లి

వివిధ వంటకాలలో రుచిని చేకూర్చడానికి ఉల్లిని వాడటం పరిపాటే. అల్లియం అనే కలువ జాతి చెట్టు కుటుంబానికి చెందిన ఈ ఉల్లి ద్వారా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. చాలా ప్రకృతి కూరగాయల తరహాలోనే ఈ ఉల్లి కూడా ఆయుర్వేద రంగంలో గొప్ప స్థాయి కలిగి ఉందనేది తెలిసిన విషయమే. దీని చరిత్ర దాదాపు 7000 సంవత్సరాలకు చెందినదే కాగా చైనాలో దీని పుట్టుక జరిగినట్లు అధ్యయన కారులు కనుగొన్నారు. దిగుబడి పరంగా చూస్తే ప్రపంచ పట్టికలో 26% తో చైనా మొదటి స్థానంలో ఉండగా 21% తో భారతదేశం రెండవ స్థానంలో కొనసాగుతోంది. అందరికీ ఎంతో మేలు చేసే ఈ ఉల్లిలో అత్యధిక లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి, మరి అవి ఏమిటో ఒకసారి చూద్దాం.

లాభాలు
 • ఉల్లిలో అత్యధికంగా ఉండే మాంగనీస్ జలుబు మరియు దగ్గు వంటి రోగాలను దరిచేరనివ్వదు. దీనిలో ఉండే విటమిన్ C, B6, ఐరన్ మరియు పొటాషియం వంటి పోషణలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా రక్తప్రసరణను సక్రమంగా ఉండేలా చూసి ఆరోగ్యవంతమైన హృదయాన్ని అందిస్తాయి.v
 • ఇక కొంతమంది ఆరోగ్య నిపుణుల ప్రకారం ఇందులో ఉండే విటమిన్ సి జుట్టు మరియు చర్మ సంరక్షణలో బాగా ఉపయోగపడుతుంది.
 • పచ్చి ఉల్లిని తినడం మూలంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితుల నుండి రక్షణ లభిస్తుంది.
 • విటమిన్ A, B మరియు C పోషణలు కలిగి ఉన్న ఉల్లి వృద్ధాప్యం దరిచేరకుండా చూసి మనల్ని నిత్య యవ్వనులుగా ఉంచుతుందని ఆరోగ్య సంరక్షకులు తెలుపుతున్నారు.
 • పచ్చి ఉల్లిని తినడం వలన నోటిలోని బాక్టీరియా నశించి, పళ్ళు పుచ్చిపోవడం అనేది జరుగదు. అంతేకాకుండా పచ్చి ఉల్లిపాయలు మధుమేహ వ్యాధిని దరిచేరకుండా చేస్తాయి.
 • కొన్ని ప్రమాదకర పురుగులు కుట్టినప్పుడు సగం కోసిన పచ్చి ఉల్లిని గాయాలపై ఉంచితే నొప్పితో పాటు మంటను సత్వరమే తీసివేస్తుంది. ముఖ్యంగా తేనెటీగలు కుట్టిన సమయంలో ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.
 • వీటిలో ఉండే క్యూర్సిటిన్ గుణాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలను దరిచేరనివ్వదు, దీనితో పాటు కడుపులో వివిధ అల్సర్లను రూపుదిద్దుకోకుండా చేస్తుంది.
 • ఇక కంటి చూపుకు, ఎముకల పటుత్వానికి మరియు చర్మ సంరక్షణకు అవసరమైన విటమిన్ ఏ ఈ ఉల్లి ఆకులలో చాలా అధిక స్థాయిలో ఉంటుంది.
 • వీటిలో ఉండే ఫోలేట్ అనే ఫోలిక్ ఆసిడ్ మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా నిద్రలేమి, అజీర్తి సమస్యలను దరిచేరనివ్వదు.
 • ఇక కొన్ని ఆయుర్వేద మందులలో ఉల్లి వినియోగం అమోఘం. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా దీని రసాన్ని తీసి పోటు ఉన్న చెవిలో పోస్తే వెంటనే నొప్పి తగ్గుతుంది. అదే సమయంలో గట్టిగా పేరుకుపోయిన వ్యర్ధ పదార్ధాన్ని సున్నితంగా మార్చి చెవి శుభ్రతను సులభం చేస్తుంది.
 • కొంతమంది ఆరోగ్య నిపుణుల ప్రకారం ఉల్లి మనిషికి శక్తిని ఇవ్వడమే కాకుండా మగవారిలో సంతానోత్పత్తిని కలిగిస్తుంది.
నష్టాలు
 • ఉల్లి వల్ల కలిగే మొదటి అడ్డంకి దుర్వాసన, వెల్లుల్లి లాగానే ఉల్లి కూడా నోటి నుండి చెడు వాసన వచ్చేలా చేస్తుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇది ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.
 • ఉల్లి వలన చర్మం సురక్షితంగా ఉన్నా, కొంతమందిలో అలర్జీ వచ్చే అవకాశం లేకపోలేదు అంటున్నారు వైద్యులు.
 • ఉల్లి ఎక్కువగా తినడం వలన శరీరంలో చక్కెర స్థాయి పడిపోతుందని, తద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్య జటిలం అవుతుందని కొంతమంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 • ఇక ఉల్లిని ఎక్కువగా తీసుకున్నవారికి అజీర్తి సమస్యలతో పాటు వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులు మరీ ఇబ్బందికరంగా మారితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
 • ఆరోగ్య చిట్కా : జలుబు మరియు చెవిపోటుకు

 • ఒక స్పూను ఉల్లి రసానికి ఒక స్పూను అల్లంతో పాటు తేనె కలుపుకోవాలి.
 • ఈ మిశ్రమాన్ని ఉదయం పడిగడుపున తీసుకుంటే జలుబు తీవ్రంగా ఉన్నవారికి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
 • ఇక కొంచెం వేడి చేసిన ఉల్లి రసాన్ని కొద్ది మోతాదులో చెవిపోటు ఉన్న చెవిలో పోస్తే నొప్పి నుండి విముక్తి లభించడమే కాకుండా చెవిలో పేరుకుపోయిన మలినాన్ని సునాయాసంగా బయటికి తీసేలా చేస్తుంది.
Continue Reading

ద్రాక్ష

ద్రాక్ష

భిన్నమైన రంగులలో లభించే ద్రాక్షను ఈ భూమ్మీదనే అత్యంత రుచికరమైన మరియు ఆరోగ్యవంతమైన పండుగా అభివర్ణింపవచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ పండుకు గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాదించే అత్యద్భుత పోషక గుణాలు ఉన్నాయి. ఎక్కువ శాతం పండుగా తీసుకొనబడే ఈ ద్రాక్ష మధువు గానూ, రసం గానూ, ఎండు ద్రాక్ష మరియు నూనె రూపంలోనూ వినియోగించబడటం జరుగుతుంది. వీటి దిగుబడి పరంగా చైనా ప్రథమ స్థానంలో ఉంటే అమెరికా మరియు ఇటలీ తరువాతి స్థానంలో కొనసాగుతున్నాయి. ప్రపంచంలోని దిగుబడిలో అధిక శాతం మధువు తయారీకి వినియోగించవడితే భారతదేశంలో మటుకు పండు ద్రాక్షను ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతుంది. మరి అటువంటి ఖరీదైన మరియు ఆరోగ్యవంతమైన పండు వలన నష్టాలు ఉంటాయా అంటే తప్పకుండా ఉంటాయంటున్నారు కొంతమంది వైద్య నిపుణులు, అవేంటో ఒకసారి చూద్దాం.

నష్టాలు
 • ద్రాక్షను తగిన మోతాదులో తింటే ఎటువంటి అనర్ధాలు ఉండవు అయితే వీటిని మితిమీరి తీసుకుంటే మటుకు కొన్ని అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు.
 • చాలామందిలో కనిపించే సాధారణ సమస్య అలర్జీ, వీరిలో ద్రాక్షను ముట్టుకున్నా లేక తిన్నా శరీరంపై దురదతో పాటు ఎర్రని మచ్చలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 • అదే నిపుణులు ఎక్కువ మోతాదులో ద్రాక్షను తీసుకోవడం మూలంగా అతిసారం, అజీర్తి మరియు మూత్రపిండాల సమస్యలతో పాటు కాలేయం చెడిపోవడం వంటి అనర్ధాలు ఎదురుకావచ్చునంటున్నారు. మధువులో ఎక్కువ ద్రాక్ష రసాన్ని వాడతారు కనుక తరచూ వైద్యులు మద్యపానం గురించి సూచనలు ఎందుకిస్తారనేది మనం అర్ధం చేసుకోవచ్చు.
 • ద్రాక్షను అరిగించుకునే సమయంలో అధిక సంఖ్యలో ఫ్రూక్టోజ్ విడుదలై కడుపులో ఉబ్బరానికి దారితీస్తుంది.
 • ద్రాక్ష గుత్తులుగా లభించడం వలన మనకు తెలియకుండానే అధికంగా తీసుకునే వీలుంది కనుక ఈ పండ్లు ఉబకాయానికి కూడా దారితీయవచ్చు.
 • ఉబ్బరం మరియు అజీర్తే కాకుండా ద్రాక్షను మితిమీరి తీసుకోవడం వలన వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంది.
 • పైన పేర్కొన్న ప్రతికూలాంశాలు అన్నీ కూడా ద్రాక్షను అమితంగా తీసుకోవడం వలన వచ్చినవే, వీటిని మితంగా తీసుకుంటే ఎటువంటి అనర్ధాలు ఉండవని వైద్య నిపుణులు చెబుతున్నారు.
లాభాలు
 • ఒక ద్రాక్ష గుత్తిలో లభించే పోషకాలు ఎన్నో కూరగాయలు మరియు పండ్లలో కూడా ఉండవని కొంతమంది వైద్యులు చెబుతున్నారు.
 • ఒక కప్పు ద్రాక్ష పళ్లలో అధిక శాతంలో విటమిన్ సి, విటమిన్ B6, విటమిన్ A, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ మరియు పీచు పదార్ధాలు ఉంటాయి.
 • అంతేకాకుండా ద్రాక్ష పండ్లలో ఎక్కువ అనామ్లజనకాలు ఉంటాయి. వీటి నుండి తీసిన రసంలో కాని, తక్కువమోతాదులో సేవించే మధువులో కాని చెడు కొవ్వును తగ్గించే గుణాలు ఉంటాయి. దీని వలన హృద్రోగ సమస్యలు దరిచేరకుండా, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
 • వీటిలో ఉండే రెస్వెరత్రోల్ అనే ప్రత్యేక గుణాలు శరీరంలో కణితులు ఏర్పడకుండా చేసి కాన్సరును దరిచేరకుండా చేస్తాయి.
 • ఆరోగ్య నిపుణుల ప్రకారం రోజూ ఒక గ్లాసు ద్రాక్ష రసం తీసుకుంటే రక్తపోటు మరియు గుండెపోటు రాకుండా ఉంటుంది.
 • అంతేకాకుండా ద్రాక్షలో బరువును తగ్గించే గుణాలతో పాటు యవ్వనంగా ఉంచే గుణాలు అధికమని ఆరోగ్య సంరక్షకులు చెబుతున్నారు.
 • ద్రాక్షలో ఊపిరితిత్తుల సమస్యలను దరిచేరకుండా చేసే గుణాలు మెండుగా ఉంటాయి. క్యారెట్లో ఉండే గుణాలు వీటిలోనూ ఉండగా, కంటికి మంచి పోషణలను ద్రాక్ష పండ్లు అందించగలవు.
 • ఎక్కువ నీటి శాతం మరియు పీచు పదార్ధం కలిగిన ఈ ద్రాక్ష వలన మలబద్దకం వంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు దరిచేరవు.
 • ఆరోగ్య చిట్కా : రక్తపోటు నియంత్రణకు

 • ఉదయమే ఎండు ద్రాక్షతో పాటు రెండు వెల్లుల్లి పాయలను తీసుకుంటే రక్తపోటు సమస్యలు దరిచేరవు.
 • అంతేకాకుండా ఎండు ద్రాక్షను రాత్రి పూట నీళ్లలో నానబెట్టి ఉదయమే పడిగడుపున తింటే గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మంచి ఉత్సాహం లభిస్తుంది.
Continue Reading